Sreeleela: ఆ విషయంలో మన స్టార్స్ చాలా గ్రేట్.. శ్రీలీల కామెంట్స్కి ఫ్యాన్స్ ఫిదా

Sreeleela: ఆ విషయంలో మన స్టార్స్ చాలా గ్రేట్.. శ్రీలీల కామెంట్స్కి ఫ్యాన్స్ ఫిదా

టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ గా మారిపోయింది సౌత్ బ్యూటీ శ్రీలీల(Sreeleela). కెరీర్ ప్రారంభంలోనే వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది. కానీ, ఆమె నటించిన వరుస సినిమాలు ప్లాప్ అవడంతో ఈ మధ్య ఆమె కెరీర్ కాస్త స్లోగా మారింది. అయినప్పటికి.. ఆమె చేతిలో క్రేజీ సినిమాలున్నాయి. ఇక శ్రీలీల డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలకి ధీటుగా మాస్ డాన్స్ చేస్తూ ఆడియన్స్ కు ఫుల్లు కిక్కిస్తోంది ఈ బ్యూటీ. రామ్, నితిన్ లాంటి సూపర్ డాన్సర్స్ కి కూడా టఫ్ ఫైట్ ఇచ్చి ఆడియన్స్ చేస్తా శెభాష్ అనిపంచుకుంది. 

ఇక ఇదే విషయాన్నీ శ్రీలీలదగ్గర ప్రస్తావించారు ఓ యాంకర్. మీరు చాలా బాగా డాన్స్ చేస్తారు. మీతో డాన్స్ చేయడానికి హీరోలు సైతం భయపడుతున్నారు. దానిపై మీరు ఏమంటారు.. అని అడిగారు యాంకర్. దానికి సమాధానంగా శ్రీలీల మాట్లాడుతూ.. నేను డాన్స్ బాగానే చేస్తాను. మీరన్నట్టుగా నాతో డాన్స్ చేయడం కష్టమని హీరోలు సైతం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. డాన్స్ విషయంలో ఎంత కష్ఠమైనా.. ఫైట్ సీన్స్ చేయడంలో మాత్రం మన స్టార్ హీరోలు చాలా గ్రేట్.  దానికోసం వారు పడే కష్టం మాములుగా ఉండదు. కష్టమైన యాక్షన్ సన్నివేశాలను కూడా అవలీలగా చేసేస్తారు. వాటితో పోల్చితే.. నా డాన్స్ నథింగ్ అనిపిస్తుంది.. అంటూ మన హీరోలను ఆకాశానికెత్తేసింది శ్రీలీల. దీంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. మరోపక్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి చేస్తున్న అనగనగా ఒకరాజు, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.