సిద్దార్థ్ నన్ను తీవ్రంగా కొట్టేవాడు.. హిందీ టీవీ నటి జోషి

సిద్దార్థ్ నన్ను తీవ్రంగా కొట్టేవాడు.. హిందీ టీవీ నటి జోషి

ముంబై: బాలీవుడ్‌‌లో మీటూ ఉద్యమం మళ్లీ ఊపందుకున్నట్లే కనిపిస్తోంది. హిందీ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని హీరోయిన్ పాయల్ ఘోష్ రీసెంట్‌‌గా కామెంట్ చేసిన విషయం తెలిసింది. ఈ వివాదం చల్లారకముందే ఇప్పుడు మరో నటి సుబుహి జోషి తన జీవితంలో జరిగిన బ్యాడ్ ఫేజ్ గురించి షేర్ చేసింది. మాజీ ప్రియుడు టీవీ యాక్టర్ సిద్దార్థ్ సాగర్‌‌తో బ్రేకప్‌‌‌తోపాటు పలు విషయాలను పంచుకుంది. 20-25 కేజీల బరువు పెరగడంతో సోషల్ మీడియాలో తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారని, అవి తనను తీవ్రంగా బాధించాయని బాధను వ్యక్తం చేసింది. సిద్దార్థ్‌‌‌తో  రిలేషన్‌‌షిప్ వల్ల తనపై తాను నియంత్రణ కోల్పోయానని.. ఆ బంధం విషపూరితమైన, దుర్వినియోగమైనదిగా పేర్కొంది. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కామెంట్స్ తర్వాత మానసికంగా కుంగిపోయానని, డిప్రెషన్‌‌లోకి వెళ్లిపోయానని వివరించింది.

‘సిద్దార్థ్ నన్ను తీవ్రంగా కొట్టాడు. పోలీసుల వద్దకు వెళ్తే వారితో తన తప్పయిందని, క్షమించమని అతడు వేడుకున్నాడు. మళ్లీ ఇలా ప్రవర్తించనని అన్నాడు. అతడు ఏడుస్తుండటాన్ని చూసి సిద్ధార్థ్‌‌ను వదిలేయాలని పోలీసులతో చెప్పా. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఏంటంటే.. నేను పెద్ద తప్పు చేశానని. అతడు జైలులో ఉండాల్సింది. సిద్దార్థ్ డబ్బులతో నేను గోవా వెళ్లా. రిలేషన్‌‌షిప్‌లో డబ్బులకు విలువ ఉండదని అతడు అర్థం చేసుకోవాలి. ఒకవేళ సిద్దార్థ్ డబ్బులు ఖర్చు చేశానని భావిస్తే నేను కూడా అతడి కోసం మనీ వెచ్చించా. ఒకరితో కలసి ఉంటున్నప్పుడు ఒకర్నొకరు సంభాళించుకోవడం కామనే. నన్ను యాక్టింగ్ వదిలేయాలని సిద్దార్థ్ చెప్పాడు. అతడి ఫాలోయింగ్‌‌ పై ఆధారపడి నేను సంపాదిస్తున్నానని సిద్దార్థ్ అనుకునేవాడు. అయినా అతడికి ఫాలోయింగ్ ఉందా?’ అని సుబుహి ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. 2018లో ఎంగేజ్‌‌మెంట్ చేసుకున్న సిద్దార్థ్, సుబుహిలు ఈ ఏడాది తమ బంధానికి స్వస్థి చెప్పారు.