నటి సుకన్య రెండో పెళ్లిపై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2003లో తన భర్తతో విడాకులు తీసుకున్న ఆమె అప్పటినుండి ఒకటరిగానే ఉంటున్నారు. తాజాగా ఆమె రెండో పెళ్లి చేసుకోనున్నారు అనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ వార్తలు నటి సుకన్య వరకు చేరడంతో ఆ వార్తలపై ఆమె స్పందించారు.
యాభై ఏళ్ల వయసులో నాకు పెళ్లా? ఒక వేళ నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే.. వాళ్ళు నన్ను అమ్మ అనాలా లేక అమ్మమ్మ అనాలా? అని ప్రశ్నించారు. అయినా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు సుకన్య. ఇక సుకన్య ఇచ్చిన క్లారిటీతో ఆమె రెండో పెళ్లిపై పుకార్లకు చెక్ పడింది.
ఇక సుకన్య విషయానికి వస్తే.. ఆమె 1991లో పుదు నెల్లు పుదు నాతు అనే మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించారు. ఇక తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా పెద్దరికం. తెలుగులో చివరగా మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమాలో కనిపించారు. ఇందులో ఆమె మహేష్ బాబుకి తల్లిగా కనిపించారు.