బుద్దుండాలి.. నాపై పడి ఏడుస్తున్నారు.. ఇదేమైనా దేశ సమస్యనా?

బుద్దుండాలి.. నాపై పడి ఏడుస్తున్నారు.. ఇదేమైనా దేశ సమస్యనా?

నటి త్రిష(Trisha) తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మండిపడ్డారు. తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఇంకేమీ సమస్యలు లేవా? నాపై పడి ఏడుస్తున్నారు అంటూ రెచ్చిపోయారు. ఇంతకీ త్రిష ఎందుకు అంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యారంటే. 

గతకొంత కాలంగా నటి త్రిష వయసుపై సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. నలభై ఏళ్ళ వయసులోనూ వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నారని చాలా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంలో త్రిష ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతుంటే.. కొందరు మాత్రం ఇదే టాపిక్ పై ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నా త్రిష మాత్రం ఎప్పుడు స్పందించలేదు కానీ.. ఇప్పుడు మాత్రం చాలా కోపంగా  రియాక్ట్ అయ్యారు త్రిష. ఇటీవల ఆమె వయసు గురించి మరీ దారుణంగా ట్రోల్స్ జరుగుతుండటంతో సహనం కోల్పోయిన త్రిష వారిపై మండిపడ్డారు. 

దేశంలో వేరే సమస్య లేనట్టు నా వయసు గురించి వార్తలు రాస్తున్నారు. ప్రెజెంట్ నా వయసు అనేది జాతీయ సమస్యగా మారిపోయింది. సరే నాకు ఇప్పుడు 40 ఏళ్లు.. దానివల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినిందా. మీకైనా సిగ్గనిపించడం లేదా? ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో 40 ఏళ్లు దాటిన హీరోయిన్లు లేరా? వాళ్ళు ఇప్పటికీ సినిమాలు చేయడంలేదా? నేనే ఫస్ట్ హీరయిన్ కాదు కదా! నాకు వరుస అవకాశాలు రావడం కొంతమందికి నచ్చడంలేదు. అందుకే నాపై ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. నేను నటిని.. నా ఆఖరిశ్వాస వరకు నటిస్తూనే ఉంటాను. అయినా నటనకు వయసుకు సంబంధం ఏంటి? ఆ మాత్రం కామన్సెన్స్ కూడా లేకపోతే ఎలా? అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు త్రిష. ప్రస్తుతం త్రిష చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.