వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో కాదు.. వితిక ఎమోషనల్

వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో కాదు.. వితిక ఎమోషనల్

వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ హీరో అని కొందరు అనడంపై  ఆయన భార్య వితిక  ఎమోషనల్ అయ్యారు.  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వరుణ్ ఆల్మోస్ట్ 17 ఏళ్లుగా సినిమాలు చేశారని చెప్పుకొచ్చారు.  సినిమాలు వద్దనుకుని అన్నీ సర్దుకుని వెళ్తే వాళ్లు ఫెయిల్యూర్.  కానీ వరుణ్   ఇండస్ట్రీనే నమ్మకుని సినిమాలు చేస్తున్నారని వితిక తెలిపింది. ఎదోక రోజు వితిక హిట్ కొడుతారంటూ వితిక ఎమోషనల్ అయ్యారు. 

వరుణ్ సందేశ్ హీరోగా నింద అనే సినిమా తెరకెక్కుతుంది. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథం నిర్మాతగా, దర్శకుడిగా ఈ సినిమాను  తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2024 జూన్ 21వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఆదివారం రోజున  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వితిక కూడా హాజరయ్యారు.  నింద సినిమాలో శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య, చత్రపతి శేఖర్, కీల‌క పాత్రలు పోషిస్తున్నారు.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వ‌రుణ్ సందేశ్‌.  ఆ తరువాత కొత్త బంగారులోకం,  ఏమైంది ఈవేళ, చమ్మక్ చల్లో వంటి చిత్రాలు మంచి హీరోగా నిలబెట్టాయి. ఆ తరువాత కథల  ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించడంతో చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి.