టెక్ దిగ్గజం గూగుల్,అదానీ గ్రూప్ లు కలిసి ఇండియాలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఇండియన్ పవర్ గ్రిడ్ కు క్లీన్ పవర్ను అందించే లక్ష్యంతో ఈ రెండు దిగ్గజ సంస్థలు సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించనున్నాయి. ఈ ఒప్పందం లో భాగంగా స్వచ్ఛమైన రెన్యువబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ ను అందించనున్నాయి.
గాలి, సౌర, హైబ్రిడ్, పవర్ స్టోరేజీ ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున కమర్షియల్, ఇండస్ట్రీయల్ వినియోగదారులకు వారి అవసరాలకు తగినంత పవర్ ను అందించ డ మే కాకుండా.. కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంగా పనిచేయనున్నాయి. గుజరాత్ లోని వరల్డ్ లార్జెస్ట్ రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ఖవడాలో 2025 మూడో క్వార్టర్స్ లో కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభించనున్నారు.
ఈ వినూత్న ఒప్పందం క్లీన్ ఎనర్జీ ద్వారా గూగుల్ క్లౌడ్ సేవలు,కార్యకలాపాలకు మద్దతివ్వడంతో భారత్ లో 24/7 కార్బన్ రహిత శక్తి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడుతుంది. అంతేకాడు భారత్ లో గూగుల్ వృద్ధికి దోహదం చేస్తుంది.
అదానీ గ్రూప్.. అహ్మదాబాద్ కేంద్రంగా భారత్ లో అతిపెద్దది, వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థ. పవర్, ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్, ఓడరేవులు, విమానాశ్రయాలు, షిప్పింగ్, రైలు, సమజ వనరులు సహా అనుక రకాల వ్యాపార రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ భారత్ లో అతిపెద్దది. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ ను ప్రారంభిస్తున్న ప్రపంచ ప్రముఖ రెన్యువబుల్ ఫ్యుయెల్ సంస్థల్లో ఒకటి. AGEL యూటిలిటి స్కేల్ గ్రిడ్ కనెక్ట్ చేయబడిన సోలార్, విండ్, హైబ్రిడ్, హైడ్రో పంప్డ్ స్టోరేజీ రెన్యువబుల్ విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది.
ALSO READ | భూటాన్‌లోకి అనిల్ అంబానీ గ్రూప్
ఇక గూగుల్ లక్ష్యం.. ప్రపంచ మొత్తానికి సమాచారం అందించడం.సెర్చింగ్, మ్యాప్స్, Gmail, Google Play, Google Cloud, Chrome, YouTube వంటి ప్రాడక్టులు ,ప్లాట్ ఫాం ల ద్వారా బిలియన్ల కొద్ది ప్రజల రోజువారీ జీవితంలో కీలక ప్రభావం చూపుతోంది.
ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిసి ఇండియన్ పవర్ గ్రిడ్ కు క్లీన్ పవర్ను అందించే లక్ష్యంతో సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు చేతులు కలి పాయి.2025లో కార్యకలాపాలు మొదలు అవుతాయి.