శ్రీ సిమెంట్ ప్లేస్‌లోకి అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ

శ్రీ సిమెంట్ ప్లేస్‌లోకి అదానీ గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్ కంపెనీ

న్యూఢిల్లీ : బెంచ్‌‌‌‌మార్క్‌‌ ఇండెక్స్ నిఫ్టీ 50 వాల్యూని నిర్ణయించే 50 షేర్లలో అదానీ గ్రూప్ ఫ్లాగ్‌‌ షిప్ కంపెనీ  అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌కు చోటు దక్కింది. ఇప్పటి వరకు ఈ ఇండెక్స్‌‌లో కొనసాగిన శ్రీ సిమెంట్‌‌ను అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ భర్తీ చేస్తుంది. ఈ మార్పు ఈ నెల 30 నుంచి అమల్లోకి వస్తుంది.  ఈ ఇండెక్స్‌‌ను మెయింటెనెన్స్‌‌ చేసే సబ్‌‌ కమిటీ (ఐఎంఎస్‌‌ఈ) తాజా రివ్యూ మీటింగ్‌‌లో ఈ నిర్ణయం తీసుకుంది. నిఫ్టీ 50 తో పాటు నిఫ్టీ నెక్స్ట్‌‌ 50, నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ 100 ఇండెక్స్‌‌లలో కూడా కొన్ని మార్పులు జరిగాయి.

అదానీ టోటల్‌‌ గ్యాస్‌‌, భారత్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌, హిందుస్తాన్‌‌ ఏరోనాటిక్స్‌‌, ఐఆర్‌‌‌‌సీటీసీ, ఎంఫాసిస్‌‌, సంవర్ధన మదర్‌‌‌‌సన్‌‌ ఇంటర్నేషనల్‌‌, శ్రీ సిమెంట్‌‌ షేర్లు నిఫ్టీ నెక్స్ట్‌‌ 50 లో ట్రేడవుతాయి.  ఈ ఇండెక్స్‌‌లో ఇప్పటి వరకు కొనసాగిన అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌, జూబిలియెంట్ ఫుడ్‌‌వర్క్స్‌‌, లూపిన్‌‌, మైండ్‌‌ట్రీ, పీఎన్‌‌బీ, సెయిల్‌‌, జైడస్‌‌ లైఫ్‌‌సైన్సెస్‌‌ షేర్లు సెప్టెంబర్ తర్వాత నుంచి నిఫ్టీ నెక్స్ట్‌‌ 50 నుంచి తప్పుకుంటాయి. కాగా, కంపెనీల మార్కెట్‌‌ క్యాప్‌‌ను బట్టి  ఏడాదిలో రెండు సార్లు నిఫ్టీ ఇండెక్స్‌‌లను   ఎన్‌‌ఎస్‌‌ఈ మారుస్తూ ఉంటుంది. ఎక్కువ మార్కెట్‌‌ క్యాప్ ఉన్న కంపెనీల షేర్లు టాప్ ఇండెక్స్‌‌లలో ట్రేడవుతుంటాయి.  మరోవైపు అదానీ గ్రీన్ ఎనర్జీ 30 షేర్లు ఉన్న సెన్సెక్స్‌‌లో ప్లేస్‌‌ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌లో సెన్సెక్స్‌‌ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఈ బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లోని డా. రెడ్డీస్‌‌ను అదానీ గ్రీన్ ఎనర్జీ భర్తీ చేయొచ్చు.