V6 News

బ్యాటరీ స్టోరేజ్‌‌ కోసం అదానీ రూ.15 వేల కోట్ల పెట్టుబడి

బ్యాటరీ స్టోరేజ్‌‌ కోసం అదానీ రూ.15 వేల కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: అదానీ గ్రీన్‌‌ ఎనర్జీ లిమిటెడ్‌‌ (ఏజీఈఎల్‌‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 10 గిగావాట్‌‌అవర్‌‌‌‌ (జీడబ్ల్యూహెచ్‌‌) పైగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌‌ సామర్థ్యాన్ని జోడించాలని చూస్తోంది.  భారతదేశంలో వేగంగా జరుగుతున్న ఎనర్జీ ట్రాన్సిషన్‌‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

2025–26లో ఇప్పటికే 1.4 జీడబ్ల్యూహెచ్‌‌ స్టోరేజ్‌‌ సామర్థ్యం జోడించగా, త్వరలో 3 జీడబ్ల్యూహెచ్‌‌ చేరనుంది. ఈ బ్యాటరీలు గుజరాత్‌‌లోని ఖవడా రెన్యూవబుల్‌‌ ఎనర్జీ పార్క్‌‌లో  ఏర్పాటు చేస్తున్నారు.  పీక్ డిమాండ్‌‌ టైమ్‌‌లో సోలార్‌‌‌‌ ఉత్పత్తి తగ్గిపోతే, ఈ స్టోరేజ్‌‌ వ్యవస్థల నుంచి  విద్యుత్‌‌ సరఫరా చేయనున్నారు.