శ్రీలంకలో అదానీ గ్రీన్‌ హైడ్రోజన్ ప్లాంట్‌

శ్రీలంకలో అదానీ గ్రీన్‌ హైడ్రోజన్ ప్లాంట్‌

న్యూఢిల్లీ: శ్రీలంకలో  గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేస్తామని శుక్రవారం  అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. వీటికి అదనంగా  అదానీ గ్రూప్ 500 మెగా వాట్ల విండ్ ప్రాజెక్ట్‌‌ను, కొలంబో పోర్ట్‌‌లో  కంటైనర్‌‌ టెర్మినల్‌‌ను  నిర్మిస్తోంది. 

కొత్త ప్రాజెక్ట్‌‌పై చర్చించేందుకు ఇండియా పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రెసిడెంట్‌‌ రణిల్‌‌ విక్రమసింఘేతో ఆయన సమావేశమయ్యారు. కాగా, సౌత్‌‌ ఏషియాలో అత్యంత ముఖ్యమైన పోర్ట్ అయిన కొలొంబో పోర్ట్‌‌లో 700 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌‌మెంట్‌‌తో అదానీ పోర్ట్స్‌‌ కంటైనర్‌‌‌‌ టెర్మినల్‌‌ను డెవలప్ చేస్తోంది. 

అంతేకాకుండా ఈ పోర్టుకు కేవలం 176 నాటికల్ మైళ్ల దూరంలోని  విజినిజం  పోర్టు (కేరళ) ను కూడా  డెవలప్ చేస్తోంది. 

శ్రీలంకలోనూ మన రూపాయి..


ఇండియన్ కరెన్సీ రూపాయిని డెజిగ్నేటెడ్‌‌ కరెన్సీగా శ్రీలంక ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపారం రూపాయిల్లో సెటిల్ అవ్వడమే కాకుండా, ఇండియన్ టూరిస్ట్‌‌లు శ్రీలంకలో  రూపాయిలను ట్రాన్సాక్షన్ల కోసం వాడుకోవచ్చు.