అదానీ యూనివర్సిటీతో విజాయిస్ట్ ఒప్పందం

అదానీ యూనివర్సిటీతో విజాయిస్ట్  ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: భారతీయ విద్యారంగంలో మార్పులే లక్ష్యంగా అదానీ యూనివర్సిటీ, ఐటీ కంపెనీ విజాయిస్ట్  ​ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎంవోయూపై అదానీ యూనివర్సిటీ  ప్రొఫెసర్ రవి సింగ్, విజాయిస్ట్ ఇన్నోవేషన్ పార్కుకు చెందిన డాక్టర్ టాసోస్ వాసిలియాడిస్ హైదరాబాదులో సోమవారం సంతకాలు చేశారు. 

భారతీయ విద్యావ్యవస్థను యూరోపియన్ ఎడ్యుకేషన్​ సిస్టమ్​కు ధీటుగా తీర్చిదిద్దడం ఈ ఒప్పందం లక్ష్యమని రెండు సంస్థలు ప్రకటించాయి. ఈ సందర్భంగా రవి సింగ్ మాట్లాడుతూ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం విజాయిస్ట్​వంటి ఐటీ కంపెనీ సహాయంతో నెరవేరుతుందని చెప్పారు. అదానీ యూనివర్సిటీ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటని ఆయన అన్నారు.