ఆర్మూర్లో అడిషనల్ ఏడీజే కోర్టును ఏర్పాటు చేయాలి : ఆర్మూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్

ఆర్మూర్లో అడిషనల్ ఏడీజే కోర్టును ఏర్పాటు చేయాలి : ఆర్మూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్

​ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిఫ్ కోర్టులో అదనంగా అడిషనల్ జిల్లా కోర్టు (ఏడీజే) ను ఏర్పాటు చేయాలని  ఆర్మూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్​లో  జిల్లా జడ్జి భరత లక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. అందుకు జడ్జి సానుకూలంగా స్పందించి హైకోర్టుకు సిఫారసు చేస్తానని చెప్పినట్లు ఆర్మూర్ అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ తెలిపారు.

ఈసందర్భంగా జిల్లా జడ్జికి ఫ్లవర్ బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా  గ్రంథాలయ కార్యదర్శి కుందారం శ్రావణ్ పాల్గొన్నారు.