‘మీ డబ్బు – మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ అమరేందర్

‘మీ డబ్బు – మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి : అడిషనల్ కలెక్టర్ అమరేందర్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేసుకొని ఆస్తుల కోసం తెచ్చిన 'మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పి.అమరేందర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో  ‘మీ డబ్బు – మీ హక్కు’ సదస్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం గత నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు, ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, ఎస్బీఐ ఆర్ఎం సునీత, టీజీబీఆర్ఎం, సంగీత, డీసీసీబీ ఏజీఎం అబ్దుల్ నబీ పాల్గొన్నారు.