ఆర్మూర్లోని మున్సిపల్ ఆఫీస్ను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఆర్మూర్లోని  మున్సిపల్ ఆఫీస్ను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​లోని మున్సిపల్ ఆఫీస్​ను గురువారం అడిషనల్​కలెక్టర్​ అంకిత్ తనిఖీ చేశారు. రికార్డులు, అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడారు.  ప్రజల నుంచి వచ్చే ఆర్జీలను స్వీకరించి త్వరగా పరిష్కరించాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ నాయకులు బల్దియా అవినీతిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.