
- అడిషనల్కలెక్టర్ అంకిత్
బోధన్,వెలుగు : బోధన్ పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని అడిషనల్కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై వార్డుల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం చేయొద్దన్నారు. పట్టణంలో చేపట్టిన కల్వర్టుల నాణ్యత పనులపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్టొన్నారు.
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్కలెక్టర్ అంకిత్ సూచించారు. సోమవారం బోధన్ లోని లయన్స్ క్లబ్ హాల్లో ప్రొసీడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలు పాటించాలన్నారు. పోలింగ్ సమ యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, బోధన్, సాలూర, ఎడపల్లి, రెంజల్ మండలాలకు చెందిన ఎంపీడీవోలు, ప్రొసిడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.