
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మూడేళ్లుగా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా అధికారులను వారు ఎన్నేళ్లుగా ఆయా సెగ్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్నారో పూర్తి వివరాలను ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
ఈ క్రమంలోనే అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను పాటించలేదు. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేలా తప్పుడు రిపోర్టును అందజేశారు. ప్రస్తుతం తాను పని చేస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఇంకా మూడేళ్లు సమయంకాలేదని ఇంకా నాలుగు నెలలు సమయం ఉందంటూ తప్పుడు సమాచారం పంపారు.