స్టూడెంట్ల కు నాణ్యమైన ఆహారం అందించాలి : అడిషనల్ కలెక్టర్ జివి.శ్యామ్ కుమార్

స్టూడెంట్ల కు నాణ్యమైన ఆహారం అందించాలి : అడిషనల్ కలెక్టర్ జివి.శ్యామ్ కుమార్
  •     అడిషనల్​ కలెక్టర్ జివి.శ్యామ్ కుమార్

 కోడేరు(పెద్దకొత్తపల్లి)వెలుగు:  నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీని గురువారం స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్ జివి.శ్యామ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, నిల్వ గదులను పరిశీలించిన ఆయన, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. బాలికల్లో రక్తహీనత నివారణకు ఏఎన్ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పౌష్టికాహార లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. 

అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షల పట్ల భయం వీడి కష్టపడి చదివి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆ తర్వాత అడిషనల్​ కలెక్టర్, పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అవసరమైన ప్రతిపాదనలను వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రమేశ్​ కుమార్, జీసీడీఓ శోభారాణి, ఎంపీడీవో నాగేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.