తప్పులు లేకుండా ఓటర్  లిస్ట్  తయారు చేయాలి : అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణ 

 తప్పులు లేకుండా ఓటర్  లిస్ట్  తయారు చేయాలి : అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణ 

గద్వాల టౌన్, వెలుగు: తప్పులు లేకుండా ఓటర్  జాబితాను తయారు చేయాలని అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణ ఆదేశించారు. గురువారం ఎంఏఎల్డీ కాలేజీలో గద్వాల నియోజకవర్గంలోని బూత్​ ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బీఎల్వోల పాత్ర కీలకమని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్​గా నమోదు చేయాలన్నారు. తహసీల్దార్  మల్లికార్జున్, మాస్టర్  ట్రైనర్  అశోక్, నరేశ్, సీనియర్  అసిస్టెంట్  నగేశ్, బీఎల్వోలు పాల్గొన్నారు.

కోడేరు: పెద్దకొత్తపల్లి హైస్కూల్ లో గురువారం బీఎల్వోలకు శిక్షణ ఇచ్చారు. ఆర్డీవో బన్సీలాల్​ హాజరై ఓటర్ల నమోదు, చనిపోయిన వారిని డిలీట్  చేయడం,పేర్లలో తప్పొప్పులు సరి చేయడంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తహసీల్దార్ ఎం. శ్రీనివాస్, మాస్టర్  ట్రైనర్  శ్రీకాంత్, రఘువర్ధన్ రెడ్డి, 57 మంది బీఎల్వోలు, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.