ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ మహేందర్ జీ

ఓపెన్ స్కూల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ మహేందర్ జీ
  •     అడిషనల్ ​కలెక్టర్ మహేందర్ జీ

ములుగు, వెలుగు : ఈనెల 25 నుంచి మే2 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించనున్నామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లోకి సెల్​ఫోన్స్​ను అనుమతించవద్దని పేర్కొన్నారు.

ములుగు జిల్లాలో ఓపెన్ స్కూల్ ఎస్ఎస్ సీకి సంబంధించి మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 526 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇంటర్ కు సంబంధించి మూడు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 602 మంది పరీక్ష రాయనున్నారని చెప్పారు.

సమావేశంలో డీఈవో పాణిని, ట్రాన్స్​కో డివిజనల్ ఇంజినీర్ పి.నాగేశ్వరరావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పి.వెంకటేశ్వర్లు, టీవోఎస్ ఎస్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ శంకర్ రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.