మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) డెలివరీలో మిల్లర్లు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నగేశ్హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్సప్లయి డీఎం జగదీశ్, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెలివరీ ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు.
యాసంగి 2024–--25 కోసం సమర్పించాల్సిన సీఎంఆర్ బ్యాలెన్స్ బకాయిల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మిల్లర్లు తమకు కేటాయించిన రోజువారీ టార్గెట్లను తప్పనిసరిగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత మిల్లర్లను డిఫాల్టర్లుగా భావించి వారికి కేటాయించిన ధాన్యాన్ని ఇతర మిల్లులకు బదిలీ చేస్తామన్నారు.
