ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది ఉండొద్దు: అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది ఉండొద్దు: అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు  : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస్​రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో ధాన్యం కొనుగోళ్లపై తహసీల్దార్లతో ఆయన సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్లు స్పీడప్​ చేయాలన్నారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతులకు త్వరగా చెల్లింపులు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 వివరాలను ఎప్పటి కప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని చెప్పారు. జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, ఇప్పటివరకు 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, దీనికి గాను రైతులకు రూ.85 కోట్ల 30 లక్షలు చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద మరో 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమీక్షలో ట్రాన్స్​కో ఎస్ఈ శ్రీనివాసాచారి, డీసీఓ గంగాధర్, కల్లూరు ఆర్డీవో రాజేందర్ గౌడ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, తహశీల్దార్లు, ఏపీఎంలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.