పిల్లలందరికీ నులిపురుగు  నివారణ మందులు వేయాలి : కలెక్టర్​ ప్రతిమాసింగ్

 పిల్లలందరికీ నులిపురుగు  నివారణ మందులు వేయాలి : కలెక్టర్​ ప్రతిమాసింగ్
  •     మెదక్​ జిల్లా టాస్క్​ఫోర్స్​ మీటింగ్​లో అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్

​మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లా వ్యాప్తంగా పిల్లలకు నులిపురుగుల మాత్రలను వేయాలని అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​ తెలిపారు. కలెక్టరేట్​లోని తన ఛాంబర్​లో  టాస్క్​ఫోర్స్​ సిబ్బందితో మంగళవారం సమావేశం నిర్వహించారు. నులిపురుగుల నివారణ  కార్యక్రమం  ఈనెల 20 నుంచి నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఉన్న 19 ఏండ్ల లోపు  పిల్లలందరికీ  అల్బెండజోల్ మాత్రలు వేయాలని  చెప్పారు.

మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా రాకుండా దోమల నియంత్రణ కార్యక్రమాలు చేయాలని తెలిపారు.  ఈ సమావేశంలో మెదక్​ జిల్లా వైద్యాధికారి డాక్టర్ చందూనాయక్​,  డీఎస్​వో నవీన్​ మల్కాజీ,  ప్రోగ్రాం ఆఫీసర్ మాధురి, అడిషనల్​ డీఎంహెచ్​వోలు డాక్టర్ విజయ నిర్మల,  డాక్టర్ అనీలా, డాక్టర్ అరుణశ్రీ  తెలిపారు.