రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు : సీతారామా రావు

 రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు : సీతారామా రావు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని ఆఫీసర్లను అదనపు కలెక్టర్ సీతారామ రావు ఆదేశించారు.  బుధవారం  కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు ఇన్​చార్జిలు, రైస్ మిల్లర్లు, వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో త్వరలో  వరి కోతలు ప్రారంభం కానున్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు.  

ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ. 2203, సాధారణ రకం ధాన్యానికి రూ. 2,183 మద్దతు చెల్లిస్తారన్నారు. వానాకాలంలో జిల్లాలో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని  అవసరాన్ని బట్టి మరిన్ని ప్రారంభిస్తామన్నారు.  

ప్రతి కేంద్రంలో  కనీస సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు.  ఏరోజు ధాన్యం వివరాలను  అదేరోజు ఆన్ లైన్​ చేయాలని, తద్వారా రైతులకు డబ్బులు సకాలంలో అందుతాయన్నారు.  కార్యక్రమంలో డీఆర్డీఏ నర్సింగ్ రావు,  అధికారులు చంద్రశేఖర్,  స్వామి కిరణ్,  పత్యా నాయక్,  బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.