
శామీర్ పేట, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మూడు చింతలపల్లి తహాసీల్దార్ ఆఫీసును ఆయన తనిఖీ చేశారు. భూభారతి దరఖాస్తులపై ఆరా తీశారు. సాంకేతిక ఇబ్బందులు ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలని, దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.