మెయిన్‌ ఆన్సర్ షీట్‌కు బదులు అడిషనల్ షీట్‌

మెయిన్‌ ఆన్సర్ షీట్‌కు బదులు అడిషనల్ షీట్‌

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌  స్కూల్‌లో ఏర్పాటు చేసిన టెన్త్ ఎగ్జామ్స్ సెంటర్‌‌ ఇన్విజిలేటర్‌‌, ఎగ్జామ్స్ ఇబ్బంది తప్పిదం విద్యార్థులకు శాపంగా మారింది.  స్టూడెంట్ల వివరాల ప్రకారం...  సోమవారం జరిగిన తెలుగు పరీక్షలో భాగంగా సెంటర్‌‌లోని రూమ్‌లో  మెయిన్ ఆన్సర్‌‌ షీట్‌కు బదులు అడిషనల్ షీట్ ఇచ్చి పరీక్ష  రాయించారు.  మంగళవారం హిందీ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థులకు అదే రూంలో మెయిన్ ఆన్సర్‌‌ షీట్ ఇచ్చారు. దీంతో  అయోమయానికి గురైన స్టూడెంట్లు.. తెలుగు పరీక్షకు తమకు మెయిన్ షీట్ ఇవ్వలేదని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకొచ్చారు.  దీంతో ఇన్విజిలేటర్‌‌ జరిగిన పొరపాటును  చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌‌కు చెప్పారు.  ఎగ్జామ్‌ అయ్యాక ఇదే విషయంపై స్టూడెంట్లు  డీఈవోకు కంప్లైంట్ చేశారు.  ఆయన ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఇదిలాఉండగా  అడిషనల్ షీట్‌లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ల రిజల్ట్‌ను విత్ హెల్డ్‌లో పెట్టే అవకాశం ఉందని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్  చేస్తున్నారు.