Krishna From Brindavanam: కృష్ణ ఫ్రమ్ బృందావనం.. కొత్త సినిమా ప్రకటించిన ఆది సాయికుమార్

Krishna From Brindavanam: కృష్ణ ఫ్రమ్ బృందావనం.. కొత్త సినిమా ప్రకటించిన ఆది సాయికుమార్

టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్(Adi Saikumar) చాలా గ్యాప్ తరువాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కామెడీ చిత్రాల దర్శకుడు వీరబద్రం చౌదరి(Veerabadram Chaudary) ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలు నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తోపాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు సాయికుమార్ హాజరయ్యారు. 

విలేజ్ బ్యాక్డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో దిగంగ‌నా సూర్య‌వ‌న్షీ హీరోయిన్ గా నటిస్తున్నారు. పూజ అనంతరం కృష్ణ ఫ్రమ్ బృందావనం సినిమా గురించి హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. చుట్టాలబ్బాయి తరువాత దర్శకుడు వీరబద్రం చౌదరితో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం కానీ, సరైన కథ కుదరలేదు. ఫైనల్ గా ఈ సినిమాకు కుదిరింది. ఫ్యామిలీ అంత కలిసి నవ్వుకునేలా ఉంటుంది ఈ సినిమా.. అని చెప్పుకొచ్చాడు.

దర్శకుడు వీరబద్రం చౌదరి మాట్లాడుతూ.. కృష్ణ ఫ్రమ్ బృందావనం అనేది న్యూ స్టైల్ తో నడిచే కథ. ఫ్యామిలీ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం ప్రధాన బలం కానుంది. ఆదితో ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్. అందుకే ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఈ సినిమాతో ఆది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా చూడాలి.