- ఇందిరమ్మ చీరల పంపిణీలో విప్ ఆది శ్రీనివాస్
కోరుట్ల, వెలుగు: ఎన్నికల్లో లబ్ధి కోసమే గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పిందని, కానీ ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్‌లో మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు ఇస్తామని స్పష్టం చేశారు.
కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల వర ప్రదాయిని కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. అనంతరం స్త్రీ శక్తి బిల్డింగ్‌ను సందర్శించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్‌చైర్‌పర్సన్ శిరీష, తహసీల్ధార్వినోద్, ఎంపీడీవో శంకర్, అధికారులు, లీడర్లు పాల్గొన్నారు.
