ఆదిలాబాద్, వెలుగు: రైతుపై ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుఇన్చార్జ్ సీఈవో, గుడి హత్నూర్ పీఏసీఎస్ సెక్రటరీ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గత శుక్రవారం అర్ధరాత్రి జైనథ్ కు చెందిన రైతు మహేశ్ తన పంట అమ్ముకుని ఇంటికి వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న మార్కెట్ యార్డ్ ఇన్ చార్జ్ పండరి రైతుపై దాడి చేసిన వీడియో వైరల్ గా మారింది. అధికారిని సస్పెండ్ చేయాలంటూ ఆదివారం రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
బాధితుడి ఫిర్యాదుతో పండరిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా మద్యం తాగినట్టు నిందితునిపై తెలిసిందని చెప్పారు. కాగా.. రైతుపై దాడి చేసిన ఘటనలో సెక్రటరీ పండరితో పాటు మన్నూర్ పీఏసీఎస్ సెక్రటరీ వెంకట్ ను కలెక్టర్ సస్పెండ్ చేస్తూ.. 7 రోజుల జీతం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
