బషీర్‌బాగ్, వెలుగు: తెలుగు సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి సోషల్ మీడియాతో పాటు పబ్లిక్‌లోనూ రోజురోజుకు సపోర్ట్ పెరుగుతోంది. రవికి మద్దతుగా సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు , వీడియోలు పెడుతున్నారు.
ఓ ఆటోడ్రైవర్ తన ఆటోపై రవికి మద్దతు తెలుపుతూ పోస్టర్ వేసుకున్నాడు. ‘తెలంగాణ రియల్ హీరో ఇమ్మడి రవి’ అని రాసి ఉన్న పోస్టర్ ను తన ఆటోపై ముద్రించుకున్నాడు. ఆ పోస్టర్ ఉన్న ఆటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వైపు పోలీసులు రవిపై రోజుకో కేసు నమోదు చేస్తూ విచారణ చేస్తుంటే పబ్లిక్‌లో రవి రియల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాడని జనం చర్చించుకుంటున్నారు.
