- వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగెంకుర్దులో విషాదం
- రంగారెడ్డి జిల్లాలో తమ్ముడి పెండ్లి కార్డు ఇవ్వడానికి వచ్చి అన్న మృతి
వికారాబాద్, వెలుగు : మరికొన్ని గంటల్లో కూతురి పెండ్లి చేయాల్సిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని సంగెంకుర్దులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సంగెంకుర్దు గ్రామానికి చెందిన అండాల అనంతప్ప (46) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
తన కూతురు అవంతిని అదే గ్రామానికి చెందిన భరత్‌కు ఇచ్చి పెండ్లి చేసేందుకు నిర్ణయించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉండడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్న చిన్న పనులు ఉండడంతో అనంతప్ప శుక్రవారం సాయంత్రం బైక్‌పై యాలాల మండల కేంద్రానికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా.. గ్రామ శివారులో బైక్ అదుపుతప్పడంతో కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అనంతప్ప తాండూరులోని జిల్లా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఆదివారం తెల్లవారుజామున అనంతప్ప చనిపోయాడు.
తమ్ముడి పెండ్లి కార్డు ఇవ్వడానికి వచ్చి అన్న...
ఇబ్రహీంపట్నం, వెలుగు : తమ్ముడి పెండ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చిన అన్న బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్ మండలం తుర్కయాంజాల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఆదిభట్ల సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన కుంచెం శ్రీశైలం (30) తన తమ్ముడి వివాహం ఈ నెల 26న ఉండడంతో కార్డు ఇచ్చేందుకు శనివారం రాత్రి తుర్కయాంజల్‌లోని బంధువు విష్ణు ఇంటికి వచ్చాడు. రాత్రి విష్ణు, శ్రీశైలం కలిసి బిల్డింగ్‌పైన పడుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటల టైంలో విష్ణు లేచి చూడగా శ్రీశైలం కనిపించలేదు. బయట కుక్కలు అరుస్తుండడంతో చూడగా శ్రీశైలం కిందపడి ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే కిందికి వచ్చి చూడగా.. శ్రీశైలం చనిపోయి
కనిపించాడు.
