ఆదిలాబాద్ టౌన్, వెలుగు: జిల్లాలోని 74 ప్రీ- ప్రైమరీ స్కూళ్లలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఈ నెల10 వరకు పొడగించినట్లు కలెక్టర్ రాజర్షి షా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక పద్ధతిలో నియమించేందుకు స్కూల్కు ఒక ప్రీ -ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు, ఎంపిక చేసిన అభ్యర్థులకు ఈ నెల 12న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
