భారీ వర్షాలకు కూలిన ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం..సిబ్బంది లేకపోవడంతో తప్పిన ప్రమాదం

 భారీ వర్షాలకు కూలిన ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం..సిబ్బంది లేకపోవడంతో  తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌‌ జిల్లాలో గురువారం కురిసిన భారీ వర్షానికి కలెక్టరేట్‌‌ బిల్డింగ్‌‌లో ఓ వైపు రెండు అంతస్తుల స్లాబ్‌‌ కుప్పకూలింది. భారీ శబ్ధం రావడంతో స్లాబ్‌‌ కూలడాన్ని గమనించిన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

నిజాం కాలం నాటి ఈ బిల్డింగ్‌‌లో కలెక్టరేట్‌‌కు సంబంధించిన పలు శాఖల ఆఫీస్‌‌లు కొనసాగుతున్నాయి. చతురస్రాకారంలో ఉన్న ఈ బిల్డింగ్‌‌లో ఓ వైపు ఉన్న స్లాబ్‌‌ కూలి హాల్‌‌ బయట ఉన్న అల్మారాలపై పడిపోయింది. దీంతో ఫైల్స్‌‌ చెల్లాచెదురయ్యాయి. 

కాగా, ఆదిలాబాద్‌‌ కొత్త కలెక్టరేట్‌‌ను జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న బట్టిసవర్గం శివారులో నిర్మిస్తున్నారు. రూ. 55 కోట్లతో నిర్మిస్తున్న ఈ బిల్డింగ్‌‌ మూడేండ్లు అయినా పూర్తి కాకపోవడంతో పాత బిల్డింగ్‌‌లోనే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.