
- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు జరిగితే వారికి సకాలంలో న్యాయం జరిగేలా, పరిహారం అందేలా ఎస్పీ, ఎస్టీ విజిలెన్స్అండ్మానిటరింగ్కమిటీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే ఎస్సీ, ఎస్టీలపై దాడులను పర్యవేక్షించే విజి లెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్, కమిటీ సభ్యులతో కలిసి పాల్గొన్న కలెక్టర్ పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి నిధుల వినియోగం, అమలవుతున్న సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలు, అనుసరించాల్సిన పారదర్శకతపై సమీక్షించారు.
సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సభ్యులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, బాధితులకు రూ.25 వేల పరిహారం వెంటనే చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, అడిషనల్ఎస్పీ కాజల్ సింగ్, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, ట్రైనీ డిప్యూటి కలెక్టర్ వంశీకృష్ణ రెడ్డి, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.