ఆజాద్ ఎన్కౌంటర్పై ఆదిలాబాద్ జిల్లా కోర్టు విచారణ

ఆజాద్ ఎన్కౌంటర్పై ఆదిలాబాద్ జిల్లా కోర్టు విచారణ

ఆదిలాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ కేసును జిల్లా కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఎన్ కౌంటర్ లో పాల్గొన్న 29 మందిని పూర్తిస్థాయిలో విచారించాలని హైకోర్టు ఆదేశించడంతో జిల్లా కోర్టులో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. గతంలో విచారణ పూర్తయి 29 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 2010లో ఆజాద్ ఎన్ కౌంటర్ పై ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు.
జిల్లా కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లగా.. మరోసారి 29 మందిపై పూర్తి స్థాయిలో పునర్ విచారణ జరపాలని కింది కోర్టుకు హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఆదిలాబాద్జి ల్లా కోర్టు మరోసారి పూర్తి స్థాయి విచారణ చేపట్టింది.