నష్ట పరిహారం చెల్లించండి ..సీఎంకు పాయల్ శంకర్ వినతి

నష్ట పరిహారం చెల్లించండి ..సీఎంకు పాయల్ శంకర్ వినతి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. బుధవార హైదరాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో 8,566 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 5,576 మంది రైతులు నష్టపోయారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

 ఆదిలాబాద్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్న నేపథ్యంలో అవసరమైన స్థల సేకరణ చేపట్టి నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.