ఆదిమూలపు సురేష్కు తృటిలో తప్పిన ప్రమాదం

 ఆదిమూలపు సురేష్కు తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది.  విశాఖ‌ప‌ట్నం ఆర్కే బీచ్ లో పారా గ్లైడింగ్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పారా గ్లైడ‌ర్ టేకాఫ్ అయ్యే స‌మ‌యంలో ఇంజ‌న్ ఒక్కసారిగా ప‌క్కకు ఒరిగిపోయింది. ఆ టైమ్ లో మంత్రి సురేష్ తో పాటుగా పైలెట్ కూడా ఉన్నారు. పారా గ్లైడ‌ర్ ప‌క్కకు ప‌డే టైమ్ లో అక్కడే ఉన్న స్థానికులు ప‌ట్టుకున్నారు. ఆ సమయంలో మంత్రలు అమర్ నాథ్, విడదుల రజిని, విశాఖ కలెక్టర్, మేయర్ కూడా అక్కడే ఉన్నారు. 

విశాఖ ఆర్‌కే బీచ్‌లో జీ 20 సదస్సు సన్నాహక భాగంగా మార్చి 26న విశాఖలో మారథాన్‌, సాహసక్రీడలను మంత్రలు ప్రారంభించారు. అయితే మంత్రి సురేష్  నిర్వాహకుల ఆహ్వానం మేరకు గ్లైడింగ్‌ ఫస్ట్‌ రైడ్‌కు వెళ్లారు. అయితే విండ్‌ డైరెక్షన్‌ సహకరించకపోవడంతో వెహికల్‌ కుదుపులకు గురై ఇసుక తిన్నెలో ఒరిగిపోయింది. అయితే ఈ సంఘటనలో మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.