
న్యాయం రెండు పాదాలతో..పదితలల అన్యాయాన్ని అణిచివేయడానికి వస్తున్నాడు శ్రీరాముడు....వస్తున్నాడు జానకిమాతను తీసుకెళ్లడానికి ప్రభాస్ రాఘవుడై వస్తున్నాడు. భారీ యాక్షన్, గ్రాండియర్ విజువల్స్ తో ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ రిలీజైంది.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆదిపురుష్. రామాయణంలో ప్రధాన ఘట్టాలను ఆధారంగా చేసుకుని దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను రూపొందించారు. ఆదిపురుష్’లో రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ లు, టీజర్లు, ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగా..తాజాగా తిరుపతిలో గ్రాండ్ గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ ఫైనల్ ట్రైలర్ ను విడుదల చేసింది.
ట్రైలర్ ఎలా ఉందంటే..
2 నిమిషాల 20 సెకన్ల ట్రైలర్ లో రామ -రావణ యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. భిక్షాందేహి అంటూ రావణుడు జానకిమాతను తీసుకెళ్లే సంఘటనతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సీన్ రావణుడిని అతి భయంకరంగా చూపించారు. ఈ సమయంలో వస్తున్నా రావణా..న్యాయం రెండు పాదాలతో నీ పదితలల అన్యాయాన్ని అణచివేయడానికి వస్తున్నా..నా జానకిని తీసుకెళ్లడానికి అంటూ రాఘవుడు చెప్పే డైలాగ్ కు గూస్ బంప్స్ రావాల్సిందే.
నా ఆగమనం..ఆధర్మ విధ్వంసం..అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ లో యాక్షన్ సీన్స్ అదుర్స్ అనిపిస్తాయి. కానీ ఈ రోజు నాకోసం పోరాడొద్దు..భరతఖండంలో పరస్త్రీ మీద చేయివేయాలని దుష్టులకు మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వణుకు పుట్టాలి..పోరాడతారా అంటూ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది.
రాఘవుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే సీన్ హైలెట్. నేను ఇక్ష్వాకు వంశోద్భవ రాఘవ..నీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివక్షుడినై ఉన్నానంటూ ప్రభాస్ చెప్పే భారీ డైలాగ్ ..సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పకనే చెప్పారు. చివర్లో ఈదశకంఠుడు పది మంది రాఘవుల కన్నా ఎక్కువ అంటూ రావణుడిగా సైఫ్ చెప్పే డైలాగ్..దీనికి బదులుగా..పాపం ఎంత బలమైనదైనా..అంతిమ విజయం సత్యానిదే అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో ... ఫైనల్ యుద్దం ఎంత భీకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తంగా ఆది పురుష్ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోందనే విషయాన్ని ఫైనల్ ట్రైలర్ చాటిచెప్పింది. ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్తో పాటు ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే వంటి వారి సీన్స్, వానర సైన్యం సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుత ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ అయితే ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు విపరీతంగా పెంచేసింది అనే చెప్పాలి.
ఆదిపురుష్ సినిమాకు అజయ్, అతుల్ సంగీతం అందిస్తుండగా.. రిట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంస్థలు నిర్మించాయి. ఈ మూవీ జూన్16న వరల్డ్ వైల్డ్ థియేటర్లలో పలు భాషల్లో భారీ స్థాయిలో విడుదల అవనుంది.