ఆదిపురుష్ హనుమాన్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు

ఆదిపురుష్ హనుమాన్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు

ఆదిపురుష్.. సినిమాలో హనుమాన్ డైలాగ్ విషయంలో ఎంత కాంట్రవర్సీ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి హనుమాన్ పాత్ర పోషించింది ఎవరో తెలుసా.. విక్రమ్ మస్తాల్. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ బాడీ బిల్డరే.. ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి పాత్ర పోషించారు. ఒక్క సినిమాతో రావాల్సినంత పబ్లిసిటీ వచ్చేంది.. వచ్చిన పబ్లిక్ పాపులారిటీతో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశారు ఆదిపురుష్ హనుమాన్.మధ్యప్రదేశ్ కి చెందిన విక్రమ్​ మస్తాల్.. 2023,  జులై 5వ తేదీన పీసీసీ చీఫ్​ కమల్​నాథ్, ఎంపీ నకుల్​నాథ్​ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో జాయిన్​ అయ్యారు. 

అనంతరం విక్రమ్ మస్తాల్ ​మాట్లాడుతూ.. మాజీ సీఎం కమల్​నాథ్​ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై కాంగ్రెస్​లో చేరుతున్నట్లు వివరించారు. దేశ సేవ చేయడానికి కాంగ్రెస్​ పార్టీ కృషి చేస్తుందన్నారాయన. అందులో భాగంగానే రాష్ట్రంలో వందల సంఖ్యలో కార్యకర్తలు పార్టీలోకి వస్తున్నారని తెలిపారు.  

తప్పుబట్టిన బీజేపీ...

ఆదిపురుష్ హనుమాన్.. కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది మధ్యప్రదేశ్ బీజేపీ పార్టీ.  దేశానికి సేవ చేయాలి అనుకుంటే.. బీజేపీలో జాయిన్ కావాలి కదా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ఆదిపురుష్ హనుమాన్ పొలిటికల్ ఎంట్రీలోనే.. కాంగ్రెస్ – బీజేపీ మధ్య మాటల యుద్ధానికి తెర తీశారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా హనుమాన్.. రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారో  చూడాలి...