
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16 విడుదలైన ఆదిపురుష్ మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 140 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. డైరెక్టర్ ప్రకాశ్ ఓం రౌత్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సిన్మాలో గ్రాఫిక్స్ బాగలేవని.. అసలు క్యారెక్టర్లను చూపించిన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై కొన్ని రకాల వివాదాలు కూడా మెుదలయ్యాయి.
సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువవుతున్న క్రమంలో ఇపుడు ఆదిపురుష్ కు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. మూవీ నెగిటివ్ రివ్యూస్ ,ట్వీట్లను తొలగించినందుకు డబ్బులు ఆఫర్ చేస్తున్నారని కొందరు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇవి ఇపుడు వైరల్ గా మారాయి.
ఆదిపురుష్ నెగిటివ్ రివ్యూలను తొలగించి పాజిటివ్ రివ్యూ పోస్ట్ చేసినందుకు రూ. 9500 చెల్లించారని ఒకరు.. నెగిటివ్ ట్వీట్ డిలీట్ చేసినందుకు ట్వీట్ కు రూ. 5500 ఆఫర్ చేశారని ఇంకొకరు ఇలా కొందరు తమ స్క్రీన్ షాట్లను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇవి నిజంగా మూవీ టీం సభ్యులు ఆఫర్ చేశారా? లేక ఎవరైన అభిమానులు చేశారా.? అసలు ఇందులో నిజమెంతా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపైన టీం సభ్యులు కూడా ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు.