అయోధ్యలో ‘ఆదిపురుష్‌‌’ టీజర్‌‌‌‌ విడుదల

అయోధ్యలో  ‘ఆదిపురుష్‌‌’ టీజర్‌‌‌‌ విడుదల

ప్యాన్‌‌ ఇండియా స్థాయిలో వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్​. వాటిలో ముందుగా రాబోయేది మాత్రం ఓం రౌత్‌‌ తీస్తోన్న ‘ఆదిపురుష్‌‌’. ఇప్పటికే షూట్‌‌ కూడా పూర్తయిన ఈ త్రీడీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌‌ జరుగుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌‌ రాముడిగా నటిస్తున్నాడు. దీంతో రాముడి జన్మస్థలమైన అయోధ్యలో మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేయనున్నారట. అక్టోబర్‌‌‌‌ 2న టీజర్‌‌‌‌ని లాంచ్ చేసి ప్రమోషన్‌‌ స్టార్ట్‌‌ చేయడానికి ప్లాన్‌‌ చేస్తున్నారు. అంతేకాదు దసరా సందర్భంగా అక్టోబర్‌‌‌‌ 5న ఢిల్లీలోని రామ్‌‌ లీలా గ్రౌండ్స్‌‌లో జరిగే రావణ దహన కార్యక్రమంలో ప్రభాస్‌‌ పాల్గొనబోతున్నాడు. ప్రభాస్‌‌కు జంటగా సీత పాత్రలో కృతి సనన్‌‌ నటిస్తుండగా రావణుడిగా సైఫ్‌‌ అలీఖాన్‌‌ కనిపించనున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇక తన పెదనాన్న కృష్ణంరాజు మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నాడు ప్రభాస్‌‌. అయితే తన కారణంగా షూటింగ్స్‌‌కు ఇబ్బంది కలగకూడదని తిరిగి ఇటీవల ‘సాలార్‌‌‌‌’ మూవీ సెట్స్‌‌లో జాయిన్‌‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్‌‌ సోషల్‌‌ మీడియాలో లీక్‌‌ అయ్యాయి. ప్రశాంత్‌‌ నీల్‌‌ డైరెక్ట్‌‌ చేస్తోన్న ఈ మూవీతో పాటు నాగ్‌‌ అశ్విన్‌‌ రూపొందిస్తోన్న సైన్స్‌‌ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్‌‌ కె’ కూడా షూటింగ్ స్టేజ్‌‌లో ఉంది. ఇక వచ్చే నెల 23న ప్రభాస్‌‌ బర్త్ డే సందర్భంగా ఈ రెండు చిత్రాల నుంచి అప్‌‌డేట్స్‌‌తో పాటు న్యూ లుక్స్‌‌ను రిలీజ్‌‌ చేసే అవకాశాలున్నాయి. మొత్తానికి అక్టోబర్‌‌‌‌లో ప్రభాస్‌‌ ఫ్యాన్స్‌‌కు ట్రిపుల్ ట్రీట్‌‌ గ్యారెంటీ.