‘ఆదిపురుష్’ టీజర్.. గూగుల్ సెర్చ్లో టాప్

‘ఆదిపురుష్’ టీజర్.. గూగుల్ సెర్చ్లో టాప్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు రూ.500 కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సీతగా కృతిసనన్ నటిస్తోంది. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని సినిమా వచ్చే సంవత్సరం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది. 

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది గూగుల్ లో సెర్చ్ చేసిన టీజర్ గా ‘ఆదిపురుష్’ రికార్డు క్రియేట్ చేసింది. గడిచిన 30 రోజులుగా గూగుల్ లో అత్యధికంగా నెటిజన్స్ వెతికింది ఆదిపురుష్ గురించేనట.. అన్ని టాపిక్ ల కంటే ‘ఆదిపురుష్’ టీజర్ ముందువరుసలో నిలిచింది. గూగుల్ లో +1850 శాతం రేటింగ్ దీనికి రావడం విశేషం. ఇదే టాప్ గూగుల్ సెర్చ్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ తాజాగా ట్వీట్ చేసింది. ‘ఆదిపురుష్ ఇంకా పైపైకి చేరుతోంది. అది ఎంత పైకి అన్నది ఈ గణాంకాలే చెబుతాయి’ అంటూ.. గూగుల్ సెర్చ్ లో టాప్ లో ఉన్న ఆదిపురుష్ పోస్టర్ ను ట్వీట్ చేసింది.