ఆగస్ట్‌‌లో ఆదిపురుష్‌‌

ఆగస్ట్‌‌లో ఆదిపురుష్‌‌

‘రాధేశ్యామ్’తో సంక్రాంతి బరిలోకి దిగనున్న ప్రభాస్.. ఇండిపెండెన్స్‌‌ డేకి మరో మూవీతో రావడానికి రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ రామాయణం ఆధారంగా ప్రభాస్‌‌తో రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వచ్చే ఆగస్ట్‌‌ 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. నిజానికి ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. అయితే కరోనా, లాక్‌‌డౌన్‌‌ల వల్ల అన్ని సినిమాల షెడ్యూల్స్ మారిపోయాయి. దాంతో ఈ సినిమా కూడా లేటయ్యే చాన్స్ ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ ఇప్పుడు మరోసారి డేట్‌‌ని  కన్‌‌ఫర్మ్ చేసింది టీమ్. గురువారం విడుదలవుతున్న ఈ చిత్రానికి లాంగ్ వీకెండ్ తో  పాటు పంద్రాగస్టు కూడా ప్లస్ కానుంది. ప్రభాస్ కెరీర్‌‌‌‌లో ఫస్ట్ మైథలాజికల్ సినిమా ఇది. తను రాముడిగా నటిస్తున్నాడు. సీతగా కృతీసనన్, లంకేశుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తోంది.  ప్రస్తుతం క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ తొమ్మిది వరకూ జరిగే ఈ లాంగ్ షెడ్యూల్‌‌లో భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. నవంబర్ లోపు షూటింగ్ పూర్తి చేసి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌‌పై ఫోకస్ పెట్టనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుద‌‌ల చేయనున్నారు. సరిగ్గా అదే రోజు అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్‌‌’ కూడా రిలీజ్ కానుంది.