
‘చెప్పకే చెప్పకే ఊసు పోని మాటలు, చాలులే వేళాకోళం ఊరుకో’ అంటూ తన మనసును కసురుకుంటోంది అదితీరావ్ హైదరి. ‘మహాసముద్రం’ సినిమా కోసం చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన సాంగ్ ఇది. నిన్న రష్మిక రిలీజ్ చేసింది. చైతన్య ప్రసాద్ రాశారు. దీప్తి పార్థసారథి పాడింది. ప్రేమలో పడిన అదితి.. తన లవర్ ఆలోచనల్లో తలమునకలవుతూ పాడుకుంటున్న పాట ఇది. హోమ్లీ లుక్‌లో చాలా క్యూట్‌గా ఉందామె. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న మూవీని రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ‘ఆర్ఎక్స్100’తో తన మార్క్ చూపించిన అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తూ ఉండటంతో మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.