కోలీవుడ్‌‌‌‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోన్న అదితీ శంకర్

కోలీవుడ్‌‌‌‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోన్న అదితీ శంకర్

మెడిసిన్ చదివింది. కానీ యాక్టింగ్ కెరీర్ ఎంచుకుంది. తన డిసిప్లిన్‌‌‌‌తో, టాలెంట్‌‌‌‌తో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ కోలీవుడ్‌‌‌‌లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది అదితీ శంకర్. ఆల్రెడీ కార్తితో ‘విరుమాన్’ మూవీలో నటించింది. ఆ తర్వాత సూర్య సినిమాకి కూడా సెలెక్టయినట్టు తెలిసింది. ఇప్పుడు ‘మహావీరుడు’ చిత్రంలో శివ కార్తికేయన్‌‌‌‌కి జోడీగా నటించే చాన్స్ కొట్టేసింది. ఈ విషయం గురించి సోషల్‌‌‌‌ మీడియాలో స్వయంగా పోస్ట్ చేసింది అదితి. ‘మహావీరన్‌‌‌‌లో నటిస్తున్నానని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. సెన్సేషనల్ స్టార్ శివ కార్తికేయన్‌‌‌‌తో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ మడోన్ అశ్విన్‌‌‌‌తో కలిసి పని చేసే చాన్స్ రావడం అదృష్టం’ అంటూ తన సంతోషాన్ని ఎక్స్‌‌‌‌ప్రెస్ చేసింది అదితి. గత నెలలో ఈ మూవీ లాంచ్ అయ్యింది. టైటిల్ వీడియోని మహేష్‌‌‌‌ బాబు విడుదల చేశాడు. కియారా అద్వానీ హీరోయిన్‌‌‌‌గా నటిస్తుందనే వార్తలు వినిపించాయి కానీ ఫైనల్‌‌‌‌గా అదితీ శంకర్ ఫిక్సయ్యింది. బైలింగ్వల్ కనుక ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకీ చేరువయ్యే చాన్స్ ఉంది.