హైదరాబాద్, వెలుగు: ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఏబీహెచ్ఎఫ్ఎల్) నిజామాబాద్‌లో కొత్త శాఖను ప్రారంభించింది. దీంతో తెలంగాణలో కంపెనీ మొత్తం నెట్‌వర్క్ తొమ్మిది శాఖలకు చేరుకుంది. మధ్య ఆదాయ కుటుంబాలలో సొంత ఇంటి ఆకాంక్షలు పెరగడం వల్ల హోంలోన్లకు డిమాండ్ బాగుందని తెలిపింది. ఈ కొత్త శాఖ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల అవసరాలను తీర్చడానికి తగిన లోన్లను అందిస్తుంది. కొత్త శాఖ ప్రారంభోత్సవ ఆఫర్ కింద జీరో లాగిన్ ఫీజుతో పాటు రూ. 50 లక్షల వరకు స్పాట్ లోన్ మంజూరు చేస్తామని ఏబీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది.
