ఏప్రిల్ 7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టు

ఏప్రిల్  7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈ నెల 7న అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నట్టు మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్​చారి తెలిపారు. ఆరో తరగతిలో అడ్మిషన్ కోసం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. 

ఏడు ఆపై క్లాసుల్లో ఖాళీలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను  https://telanganams.cgg.gov.in ద్వారా సోమవారం నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,983 మంది స్టూడెంట్లు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, దీంట్లో ఆరో తరగతిలో సీట్ల కోసం 35 వేల మంది అప్లయ్​ చేసుకున్నారని వెల్లడించారు.