సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీలో బీఏ

 సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన వర్సిటీలో బీఏ

ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-–25 విద్యా సంవత్సరానికి బీఏ కోర్సులో అడ్మిషన్స్​ ప్రారంభమయ్యాయి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హులైన జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దివ్యాంగ అభ్యర్థులు మార్చి 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు: బీఏ ఇంగ్లీష్ (ఆనర్స్): 25+8 సీట్లు ఉండగా,  కనీసం 60 శాతం మార్కులతో ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు (ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా) ఉత్తీర్ణులై ఉండాలి. బీఏ సోషల్ సైన్సెస్

(ఆనర్స్): 25+8 సీట్లు ఉండగా ఏదైనా స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం 60 శాతం మార్కులతో ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టు ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు నాలుగేళ్లు ఉంటుంది.

సెలెక్షన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే సీయూఈటీ- యూజీ 2024 ప్రవేశ పరీక్ష, రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  

జనరల్ కేటగిరీకి రూ.600. ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీకి రూ.550. ఓబీసీ- ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటగిరీకి రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ కేటగిరీకి రూ.275 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. 

పరీక్ష మే 15 నుంచి 31 తేదీల్లో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.ssctu.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.