కల్తీ.. కల్తీ.. పెట్రోల్కు బదులు నీళ్లు.. ఆగ్రహించిన బైకర్లు.. బంక్ ముందు ఆందోళన

కల్తీ.. కల్తీ.. పెట్రోల్కు బదులు నీళ్లు.. ఆగ్రహించిన బైకర్లు.. బంక్ ముందు ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరీగూడలో కల్తీ పెట్రోల్ పోశారని బంక్ ముందు ఆందోళనకు దిగారు బైకర్లు. స్థానికంగా ఉన్న పవన్ హెచ్ పీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులు.. బైకులు స్టార్ట్ కాకోవడం.. స్టార్ట్ అయినా కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయారు. ఇలా దాదాపు 20 బైకులు కిలోమీటర్ వెళ్లగానే నిలిచిపోయాయి. అనుమానం వచ్చి వాహనదారులు బంక్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు.