పెద్దలను మన పిల్లల మాదిరి చూసుకోవాలి: గవర్నర్ తమిళిసై

పెద్దలను మన పిల్లల మాదిరి చూసుకోవాలి: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: కరోనా టైమ్ లో పెద్ద విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటామో అంతే స్థాయిలో పెద్దల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు. రాజ్ భవన్ నుంచి చికాగోలోని మెట్రోపాలిటన్ ఆసియన్ ఫ్యామిలీ సర్వీసెస్ (మాఫ్స్) వర్చువల్ సమ్మిట్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దలకు ఎక్కువ ప్రమాదం ఉందని, సీనియర్ సిటిజన్లకు మంచి జీవన పరిస్థితులను సృష్టించాలని పిలుపునిచ్చారు. పెద్దలు గతంలో చాలా క్లిష్ట పరిస్థితులను విజయవంతంగా ఎదుర్కొన్నారని, ఎంతో అనుభవాన్ని కలిగి ఉన్నా రని గుర్తు చేశారు. ఫిజికల్ డిస్టెన్స్​పేరుతో సీనియర్ పౌరులను కుటుంబాల నుంచి దూరంగా ఉంచిన కొన్ని సందర్భాలను ఈ సందర్భంగా గవర్నర్​పేర్కొన్నారు. వృద్ధుల విషయంలో పిల్లల సంరక్షణతో సమానంగా శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. గత 28 సంవత్సరాలుగా యూఎస్‌ఏలోని పెద్దలకు అంకితభావంతో సేలు చేస్తున్న మాఫ్స్ వ్యవస్థా పకుడు ఎంఎస్ సంతోష్ కుమార్ కృషిని గవర్నర్ ప్రశంసించారు.