
న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ డిశ్చార్జ్ అయ్యారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో ఆయన బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. యూరాలజీ, కార్డియాలజీ వంటి స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అద్వానీఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. ఆయనను ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ చేసింది. అయితే, ఆయన అస్వస్థతకు గురి కావడానికి గల కారణాన్ని మాత్రం ఆస్పత్రి పేర్కొనలేదు. కాగా, ఎల్ కే అద్వానీ ఉప ప్రధానిగా, ఇతర అనేక కీలక పదవులను నిర్వహించారు.