అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు 100 పతకాలు

అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు 100 పతకాలు

కరీంనగర్ సిటీ, వెలుగు: అద్విత ఇంటర్నేషనల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ వై.విశ్వక్ సేన్  మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీలో వంద పతకాలు సాధించారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, ఢిల్లీ, గోవా, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ (గోల్డ్), మలేషియా (గోల్డ్ & సిల్వర్), థాయిలాండ్ (సిల్వర్) లో  విజయాలు సాధించాడు.

 మొత్తంగా 53 గోల్డ్, 28 సిల్వర్, 19 బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా బుధవారం స్కూల్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్  సౌగాని కొమురయ్య , డైరెక్టర్ సౌగాని అనుదీప్, ప్రిన్సిపాల్ మాధురి సత్కరించి అభినందించారు.